ముంగిలి

వెలగా వెంకటప్పయ్య ఆంధ్ర ప్రదేశ్ లో గ్రంథాలయోద్యమానికి సారథి. గ్రంథాలయ పితామహుడు, మానవతావాది, పరిపాలనాదక్షుడు, పత్రికా సంపాదకుడు, సాహితీవేత్తగా పలువురి మన్ననలు పొందారు. తన జీవితమంతయూ గ్రంథాలయోద్యమానికి ధారపోశారు. గ్రంథాలయ పితామహుడిగా పేరుపొందారు. గుంటూరు జిల్లా తెనాలి వాస్తవ్యుడు. శాఖా గ్రంథాలయములో చిన్న ఉద్యోగిగా చేరి, స్వయంకృషితో యమ్.ఎ, బాలసాహిత్యంలో పరిశోధన ద్వారా పి.హెచ్.డి పొందారు.

డాక్టర్ వెలగా వెంకటప్పయ్య
డాక్టర్ వెలగా వెంకటప్పయ్య

బాల సాహిత్యములో ఎన్నో రచనలు చేశారు. మరుగున పడిన రచనలు, ముఖ్యముగా పిల్లల సాహిత్యములో ఎందరో మహానుభావుల కృషిని సేకరించి పొందు పరిచారు. గ్రంథాలయ విజ్ఞానములో వెంకటప్పయ్య తాకని అంశం లేదు. 100కు పైగా పుస్తకాలు, ముఖ్యముగా గ్రంథాలయ విజ్ఞానమునకు సంబంధించి వ్రాసిన గ్రంథాలు అత్యంత ప్రామాణికమైనవి. పలు పుస్తకాలు పాఠ్య గ్రంథాలుగా తీసుకొనబడ్డాయి.

వెంకటప్పయ్య వయోజన విద్య, సంపూర్ణ అక్షరాస్యత ఉద్యమాలలో ప్రముఖ పాత్ర వహించారు.