గుర్తింపులు

డాక్టర్ వెలగా వెంకటప్పయ్య
  • ఉస్మానియూ యూనివర్శిటీ నుంచి లైబ్రరీ సైన్సులో డిప్లొమా పొందారు.
  • 1971లో ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు తెలుగులో బాలసాహిత్య వికాసం, ఆంధ్రప్రదేశ్‌లో బాలల గ్రంథాలయాల ప్రగతిపై ఆయన చేసిన పరిశోధనా కృషికి పీహెచ్‌డీ బహుకరించారు.
  • వెంకటప్పయ్య గారు ప్రతిపాదించిన విషయాలతో మోడల్‌ పబ్లిక్‌ లైబ్రరీ అండ్‌ ఇన్‌ఫర్మేషన్‌ సర్వీసెస్‌ యాక్టును దేశమంతటికీ వర్తించేలా ఆమోదింపజేశారు.
  • వాషింగ్టన్‌లోని ప్రపంచ ప్రసిద్ధ గ్రంథాలయంలో లైబ్రరీ సైన్స్‌పై ఆయన రాసిన పుస్తకాలను ఉంచారు.
    అనేక ప్రత్యేక, సంస్మరణ సంచికలకు సంపాదకత్వం వహించారు.
  • 20వ శతాబ్ది తెలుగు వెలుగులు – పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యఅలయం ప్రచురణ- దీని సంపాదక వర్గంలో వెలగా వెంకటప్పయ్య ఒకరు.
  • భారత గ్రంథాలయోద్యమం, మార్చ్‌ ఆఫ్‌ లైబ్రరీ సైన్స్‌ తదితర గ్రంథాలకు సంపాదకత్వం వహించారు.
  • ఆయన రచించిన మన వారసత్వం గ్రంథానికి తెలుగు విశ్వ విద్యాలయం ఉత్తమ గ్రంథంగా అవార్డు ఇచ్చింది.
  • ‘తెలుగులో బాల సాహిత్య వికాసం- ఆంధ్రప్రదేశ్‌లో బా లల గ్రంథాలయాల ప్రగతి’పై ఆయన రాసిన పరిశోధన వ్యాసం, ఆ ఏడాది అత్యుత్తమంగా ఎంపికై బంగారుపత కం అందుకుంది.
  • తెలుగు పుస్తకాల అమరిక, నిర్వహణలో ఎదురవుతున్న చిక్కులను తొలగించటానికి విదేశాల్లోని గ్రంథాలయ, సమాచార శాస్త్రవేత్తల సూచనలను పరిశీలించి మన పరిస్థి తులకు అనుగుణంగా, ‘వర్గీకరణ నియమాలు’, ‘గ్రంథ కర్త గుర్తులు’, ‘విషయ శీర్షికలు’ తీసుకొచ్చారు.
  • రాష్ట్ర ప్ర భుత్వ పౌర గ్రంథాలయశాఖ తెలుగుపుస్తకాల వర్గీకర ణకు డ్యూయీ దశాంశ వర్గీకరణ విధానాన్ని సవరించినూ తన జాబితాల తయారీలో ప్రముఖ పాత్ర పోషించారు.
  • గ్రంథాలయ శాస్త్ర పారంగత, ఉత్తమ గ్రంథ పాలక, బాల బంధు, ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ అవార్డు, గ్రంథాలయ గాంధీ వంటి అనేక పురస్కారాలను అందుకున్నారు.
  • ధర్మవరంలోని కళాజ్యోతి సంస్థ వెలగాపై గౌరవంతో పౌర గ్రంథాలయ సేవలోని ఉత్తమ గ్రంథపాలకులకు 1990 నుంచి ఆయన పేరుతో పురస్కారాన్ని ప్రదానం చేస్తున్నారు.
  • గుంటూరులోని ఒక వీధికి వెలగా పేరిట నామకరణం చేశారు.
  • వెలగా జన్మదినం సందర్భంగా 2014 జూన్‌లో విజయనగరం జిల్లా తోటపల్లి, పార్వతీపురంలో 50 గ్రామీణ గ్రంథాలయాలను ఆయనచే ప్రారంభింపజే శారు.