రచనలు

 • సోవియట్ రష్యా ప్రభుత్వ ఆహ్వానంపై మాస్కో పర్యటనకు వెళ్లివచ్చాక ‘లెనిన్ గ్రంథాలయ విధానం’, ‘లైబ్రరీ సైంటిఫిక్ అండ్ టెక్నికల్ ఇన్ఫర్మేషన్ ఇన్ ది యూఎస్‌ఎస్‌ఆర్’ గ్రంథాన్ని వెలువరించి ఆ వ్యవస్థను తెలుగువారికి పరిచయం చేశారు.
 • వెలగా రచించిన ఆంధ్ర వాఙ్మయ సంగ్రహ సూచిక, శాస్త్రీయ వాజ్ఞయ సూచిక, గ్రంథసూచికలు వివిధ రంగాలపై ఆయనకు గల విషయ పరిజ్ఞానానికి అద్దం పడతాయి.
 • కాకతీయ యూనివర్సిటీకి సర్టిఫికెట్ కోర్సుకు ఆరు పుస్తకాలు, డిగ్రీకి 12 పుస్తకాలు రాశారు.
 • పౌర గ్రంథాలయ చట్టాల పత్రాలను తెప్పించి ‘ఇండియన్ లైబ్రరీ లెజిస్లేషన్’ అనే గ్రం థాన్ని రెండు సంపుటాల్లో వెలువరించారు.
 • 1990లో ఉద్యోగ విరమణ అనంతరం రచనా వ్యాసంగలోనే నిమగ్నమయ్యారు. ప్రముఖుల చరిత్రలు, నిఘంటువులు, తెలుగు ప్రముఖులు, బాలసాహిత్యంలో అనేక పుస్తకాలను తీసుకొచ్చారు. నమూనా పౌర గ్రంథాలయ చట్టం రూప కల్పన, గ్రంథాలయాల గ్రంథసూచీలు, అనుక్రమణికల తయారీ, పుస్తక ప్రచురణ, బాలసాహిత్య రచనలో కృషి చేశారు. గ్రంథాలయ శాస్త్రంలో 80కి పైగా రచనలు, సుమారు 300వ్యాసాలు రాసిన డాక్టర్ వెంకటప్పయ్య గ్రంథాలయోద్యమంలో అంకితభావంతో కృషిచేసిన మహోన్నతుడిగా నిలిచిపోయారు. బాలల కోసం 30వేల తెలుగు సామెతలు, వేయి తెలుగుబాలల జానపద గేయాలు, 3వేల పొడుపు కథలు, 15వేల జాతీయాలు సేకరించి ప్రచురించారు.
 • కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగు విభాగంలో సభ్యులైన వెంకటప్పయ్య వివిధ భాషా సాహిత్యాలను ప్రోత్సహించారు.
 • గ్రంథాలయ సేవా నిరతులు
 • బాల సాహితి వికాసము – డాక్టరల్ థీసిస్
 • బాల సాహితి
 • బాలానంద బొమ్మల కుమార శతకము
 • బాలానంద బొమ్మల పండుగ పాటలు
 • పొడుపు కథలు
 • బాలానంద బొమ్మల పొడుపు కథలు
 • మన పిల్లల పాటలు
 • మన వారసత్వం
 • తెలుగు వైతాళికులు – ముట్నూరి కృష్ణారావు
 • రేడియో అన్నయ్య – న్యాపతి రాఘవరావు
 • గ్రంథాలయ వర్గీకరణ (1976)
 • గ్రంథాలయ సూచీకరణ (1976, 1987)